పనులు త్వరతగతిన పూర్తి చేయాలి: మేయర్ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వరంగల్ మహనగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేటర్లు హజరయ్యారు.
ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి సైకిల్‌పై వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగర అభివృద్దికి నెలకు రూ.75 కోట్లు ఇస్తుందని మేయర్ పేర్కొన్నారు. నగరంలో పార్కులు, శ్మాశాన వాటికలు, కమ్యూనిటీ హల్స్‌కు నిధులు కేటాయించినట్టు తెలిపారు. ముఖ్యంగా ఆరో డివిజన్లో ఐదు కోట్లతో స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. నేటి కౌన్సిల్లో 119 ఎజెండా అంశాలకు 155.11 కోట్ల రూపాయలతో 380 అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందన్నారు.
ఇదీ చూడండి :'హామీలు నెరవేర్చాకే సాగర్ ఉప ఎన్నికలో ఓట్లు అడగాలి'