తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2020, 4:17 AM IST

ETV Bharat / state

'గ్రేటర్​ అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలి'

గ్రేటర్​ వరంగల్​ నగర అభివృద్ధికి సంబంధించిన పనుల నిధులను విడుదల చేయాలని మేయర్ గుండా ప్రకాశ్​రావు కోరారు. నగరానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్​కుమార్​ని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక సమస్యలను విన్నవించారు.

mayor prakash rao said Greater warangal development work bills to be pending
'గ్రేటర్​ అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలి'

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు రాష్ట్ర మునిసిపల్ సెక్రెటరీ అర్వింద్​ కుమార్​ను కోరారు. వరంగల్​ నగరానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రెటరీని మేయర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ముఖ్యమంత్రి హామీ నిధులకు చెందిన అభివృద్ధి పనుల బిల్లులను చెల్లించాలని కోరారు.

పారిశుద్ధ్య నిర్వహణ కోసం పట్టణ ప్రగతి నిధులతో 268 వాహనాలను కొనుగోలు చేశామని... వాటికి డ్రైవర్లను అవుట్​సోర్సింగ్​ ప్రాతిపదికన నియమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు అనుమతి ఇవ్వాలని కోరగా... ప్రిన్సిపల్ సెక్రెటరీ స్పందించి మంజూరు చేస్తానని తెలిపారు.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు 40% మించిపోకూడదనే నిబంధనలు ఉన్నందున... మిగతా వేతనాలను ప్రభుత్వం భరించేలా చూడాలని తెలిపారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపితే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపల్ సెక్రెటరీ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి :వచ్చే నెలలో టీ-వర్క్స్ ప్రారంభమౌవుతాయి: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details