ఇంటింటికి చెత్త సేకరణ కోసం వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు. నగరంలోని 58 డివిజన్లలో చెత్త సేకరణ చేసేందుకు కొత్తగా 23 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ గుండా ప్రకాశ్ స్వచ్ఛ ఆటోలను అందించారు.
స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మేయర్ ప్రకాశ్ - వరంగల్ మహానగర పాలక సంస్థ తాజా వార్తలు
వరంగల్ మహానగర పాలక సంస్థ ఇంటింటకి వెళ్లి చెత్త సేకరించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ తరుణంలో గ్రేటర్ పరిధిలో 58 డివిజన్లలో కొత్తగా 23 స్వచ్ఛ ఆటోలను మేయర్ గుండా ప్రకాశ్ ప్రారంభించారు.
![స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మేయర్ ప్రకాశ్ mayor launched clean autos at warangal city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8585059-184-8585059-1598575713466.jpg)
స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మేయర్ ప్రకాశ్
మొత్తం 73 ఆటోలకుగాను మొదటి విడతలో 23 ఆటోలు నగరపాలక సంస్థకు చేరాయని మేయర్ తెలిపారు. నగరాన్ని పచ్చదనం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ మరింత వేగవంతం చేసేందుకు నూతనంగా ఆటోలను కొనుగోలు చేశామని వెల్లడించారు.
ఇదీ చూడండి :వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం.. వసతి గృహానికీ మంటలు