వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో మే 'డే' వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మికుల దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని వినయ్ భాస్కర్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఏ ఒక్క కార్మికుడు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం వలస కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కొంత నగదును కూడా అందించినట్లు పేర్కొన్నారు.
హన్మకొండలో మే 'డే' వేడుకలు - CHIEF WHIP VINAY BHASKER
వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో కార్మికుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వలస కూలీలకు నిత్యావసర సరుకులతో పాటు నగదు అందించారు.
వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ