వరంగల్ అర్బన్ ఎంజీఎం కూడలిలోని రాజరాజేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించారు. శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం నోచుకుంటే సకాల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.
రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వ్రతాలు - రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వ్రతాలు
శ్రావణమాసంలోని మూడో శుక్రవారాన్ని పురస్కరించుకొని వరంగల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వ్రతాలు