తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టు దంపతుల లొంగుబాటు.. రూ.9 లక్షల రివార్డు

వరంగల్​ పోలీస్​ కమిషనరేట్​లో మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. వారిద్దరిపై కలిపి రూ. 9 లక్షల మేర రివార్డు ఉందని వారు లొంగిపోయిందుకు గానూ ఆ రివార్డు వారికే అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్​ రవీందర్​ తెలిపారు.

Maoist couple surrendered to police at warangal
మావోయిస్టు దంపతుల లొంగుబాటు.. రూ.9 లక్షల రివార్డు

By

Published : Mar 22, 2020, 3:34 PM IST

మావోయిస్టు పార్టీ డివిజనల్‌ కమిటీ సభ్యుడు, సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో కమ్యూనికేషన్‌ విభాగం ఇన్‌ఛార్జి గండ్రకోటి మల్లేశం అలియాస్‌ మల్లయ్య, కిరణ్.. ఆయన భార్య మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీలో ఏరియా కమిటీ సభ్యురాలు చింత శ్రీలత, అలియాస్‌ హైమ శనివారం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో లొంగిపోయారు. మల్లేశం దంపతులకు తాత్కాలికంగా రూ.5 వేల చెక్కును పోలీసు కమిషనర్‌ వి.రవీందర్‌ అందించారు.

1993 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 8 వేల మంది మావోయిస్టులు లొంగిపోయారని రవీందర్​ తెలిపారు. వారికి ఉపాధి కల్పించడం, ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు రూ.27.25 లక్షలు ఖర్చు చేశామన్నారు. మల్లేశంపై రూ.5 లక్షలు, శ్రీలతపై రూ.4 లక్షల రివార్డు ఉందని, వారి లొంగుబాటును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ మొత్తాన్ని వారికే ఇప్పిస్తామన్నారు.

మావోయిస్టు దంపతుల లొంగుబాటు.. రూ.9 లక్షల రివార్డు

ఇదీ చూడండి:జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా...

ABOUT THE AUTHOR

...view details