తెలంగాణ

telangana

ఓరుగల్లులో తగ్గని వరద ఉధృతి.. ఇంకా ముంపులోనే పలు కాలనీలు

వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని పలు కాలనీల్లో వరద ఇంకా కొనసాగుతోంది. శివనగర్, మైసయ్య నగర్ ప్రాంతాల్లో రాతికోట దిగువన ఉన్న అగర్తలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా కాలనీల్లో వరద కొనసాగుతోంది.

By

Published : Aug 18, 2020, 12:11 PM IST

Published : Aug 18, 2020, 12:11 PM IST

ఆ నగరంలోని పలు కాలనీల్లో ఇంకా వరద ఉద్ధృతి కొనసాగుతోంది
ఓరుగల్లులో తగ్గని వరద ఉధృతి.. ఇంకా ముంపులోనే పలు కాలనీలు

వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని పలు కాలనీల్లో వరద కొనసాగుతోంది. శివనగర్ మైసయ్య నగర్ ప్రాంతాల్లో వరంగల్ రాతికోట దిగువన ఉన్న అగర్తలా ఉప్పొంగి ప్రవహిస్తుండటం వల్ల కాలనీల్లో వరద ఉద్ధృతమవుతోంది.

ఓరుగల్లులో తగ్గని వరద ఉధృతి.. ఇంకా ముంపులోనే పలు కాలనీలు

అత్యవసర పరిస్థితిల్లో తప్ప శివనగర్ వాసులు రోడ్డు ఎక్కట్లేదు. గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నగరంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే నగరంలో పలుచోట్ల కొంత వరద ప్రవాహం తగ్గింది. కట్ట మల్లన్న చెరువు మత్తడి పోవడం వల్ల లక్ష్మీ గణపతి కాలనీ మధురా నగర్​ ఇంకా జల దిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి.

ఇవీ చూడండి : ఇన్​స్పెక్టర్​ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్

ABOUT THE AUTHOR

...view details