ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మందకృష్ణ మాదిగ హన్మకొండలోని ఎకశిలా పార్కులో కార్మికులు చేస్తున్న ఆందోళనలో మంగళవారం పాల్గొన్నారు. ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడ్ చనిపోవడం చాలా బాధకరమని మందకృష్ణ అన్నారు. ఎప్పటికైనా ఆర్టీసీ కార్మికులు తెగించి పోరడాలి కానీ ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించే దిశగా వ్యవహరించాలన్నారు.
ఆర్టీసీ సమ్మెకు మందకృష్ణ మాదిగ మద్దతు - MRPS president Mandakrishna Madiga demands immediate solution of RTC workers' problems in Warangal
ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వరంగల్‌లో డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెకు మందకృష్ణ మాదిగ మద్దతు
Last Updated : Oct 16, 2019, 2:13 PM IST