కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ప్రదర్శించి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వరంగల్లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదనడం సరికాదన్నారు. న్యాయవ్యవస్థ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉండే రక్షణ చట్టాలను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలోనూ అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.