తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్చి 8న కొంగర కలాన్‌లో యుద్ధభేరి సభ: మంద కృష్ణ - manda krishna madiga Visitation warangal murder victim

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై జరుగుతన్న దాడుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మంద కృష్ణ మాదిగ ఖండించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మార్చి 8న కొంగకలాన్‌లో యుద్ధభేరి సభ
మార్చి 8న కొంగకలాన్‌లో యుద్ధభేరి సభ

By

Published : Jan 14, 2020, 5:57 PM IST

వరంగల్‌లో ఇటీవల యువతిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఇవాళ ఆయన పరామర్శించారు. ఘటనా వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయని కృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వ తీరును ఖండించారు. దీనికి నిరసనగా మార్చి 8న కొంగరకలాన్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యుద్ధబేరి సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మార్చి 8న కొంగకలాన్‌లో యుద్ధభేరి సభ

ఇవీ చూడండి;బస్తీమే సవాల్: మున్సిపల్​ వార్​లో యువత బస్తీమే సవాల్

ABOUT THE AUTHOR

...view details