కేంద్రం త్వరితగతిన ఎస్పీ వర్గకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. రిజర్వేషన్లు రాకముందు అగ్రవర్ణాలు దళితులను దోచుకున్నాయని.. రిజర్వేషన్లు వచ్చిన తర్వాత కొన్ని కులాలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. వర్గీకరణ బిల్లు కోసం ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తానని దాని చట్టబద్ధత కోసం డిసెంబర్ 17న లక్ష మందితో ఛలో దిల్లీ పేరుతో మహాధర్నా చేపడతామని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు సమష్టి పోరు - ఎస్సీ వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ బిల్లు అంశంపై వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లిలో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ సమావేశం ఏర్పాటు చేశారు.
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు సమష్టి పోరు