కూలీలకు తోచిన సాయం చేస్తూ... దాతృత్వం చాటుతున్నాడు మండువ సంతోశ్. కరోనా కారణంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వలస కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. కూలీల ఆకలి కేకల విన్న సంతోశ్ వాళ్లకు చేయూత అందించారు. తన వంతు సాయంగా బియ్యం, నిత్యావసర వస్తువులు అందించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
కూలీల ఆకలి తీరుస్తున్న హన్మకొండ యువకుడు - వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ
లాక్‌డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తోన్న వలస కూలీల ఆకలి తీరుస్తున్నాడు హన్మకొండ యువకుడు. పట్టణంలోని కూలీలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేసి మానవత్వం చాటుతున్నాడు.
కూలీల ఆకలి తీరుస్తున్న హన్మకొండ యువకుడు
లాక్‌డౌన్‌తో అన్నంలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
ఇదీ చూడండి:మనిషి కంటే ముందే పుట్టిన వైరస్‌లు