తెలంగాణ

telangana

ETV Bharat / state

భవనం కూలి వ్యక్తి మృతి... గ్రేటర్​ పరిధిలో పాత ఇళ్లు కూల్చివేత - కిల్లా వరంగల్ పడమర కోట

శిథిలావస్థ భవనం కూలి కిల్లా వరంగల్ పడమర కోటకు చెందిన వెంకటేశ్వర్లు మృతి చెందాడు. ఘటనతో అప్రమత్తమైన గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు గ్రేటర్ పరిధిలోని పాత భవనాలను గుర్తించి వాటిని జేసీబీ సహాయంతో నేలమట్టం చేస్తున్నారు.

శిథిలావస్థ భవనం కూలి వ్యక్తి మృతి... పాత ఇళ్లు నేలమట్టం చేస్తోన్న అధికారులు
భవనం కూలి వ్యక్తి మృతి... గ్రేటర్​ పరిధిలో పాత ఇళ్లు కూల్చివేత

By

Published : Aug 20, 2020, 1:44 AM IST

శిథిలావస్థ భవనం కూలి కిల్లా వరంగల్ పడమర కోటకు చెందిన వెంకటేశ్వర్లు మృతి చెందడం వల్ల గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ పరిధిలోని పాత భవనాలను గుర్తించి వాటిని జేసీబీ సహాయంతో నేలమట్టం చేస్తున్నారు.

మిగిలిన వాటికి నోటీసులు...

గాంధీనగర్​లో 20 పాత భవనాలను గుర్తించిన అధికారులు.. అందులో 8 భవనాలను కూల్చేశారు. మిగిలిన వాటికి నోటీసులు అందజేసినట్లు వివరించారు. శిథిలావస్థ భవనాలను విడిచి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని నగర పాలక సంస్థ అధికారులు సూచించారు. ఈ మేరకు స్వచ్ఛ ఆటోల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

ఇవీ చూడండి : ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే...

ABOUT THE AUTHOR

...view details