తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చాడు... నీళ్లడిగాడు... కత్తితో దాడి చేశాడు - eka shilanagar

దాహంగా ఉంది... మంచినీళ్లు ఇవ్వండని అడిగాడో యువకుడు. వేసవి కాలం... అసలే మధ్యాహ్నం... పాపం ఎంత దాహంతో అడిగాడోనని ఇచ్చేందుకు వంటగదిలోకి వెళ్లింది ఆ మహిళ. అంతే ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి ఒక్కసారిగా కత్తితో ఆమెపై దాడి చేశాడు.

మహిళపై కత్తితో దాడి

By

Published : May 6, 2019, 8:04 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఏకశిలానగర్​లోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి నీళ్లు కావాలని అడిగాడు. ఈ క్రమంలో గృహిణి ఇంట్లోకి వెళ్లి నీళ్లు తీసుకువచ్చే సమయంలో ఇంట్లో ఎవరు లేరన్న విషయాన్ని గమనించాడు ఆ ఆగంతకుడు. వెంటనే ఒంటరిగా ఉన్న లక్ష్మీపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన మహిళ బిగ్గరగా అరిచింది. ఈ కేకలకు చుట్టు పక్కలవాళ్లు రావడం గమనించి అక్కడినుంచి దుండగుడు జారుకున్నాడు.

మహిళపై కత్తితో దాడి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. దొంగతనం చేసేందుకే దుండగుడు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details