వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద మహాత్ముని విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ, మేయర్ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - mla vinay bhaskar at gandhi jayanthi celebrations
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. గాంధీజీ విగ్రహానికి ప్రభుత్వ విప్ వినయ్‌భాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జిల్లా కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత గాంధీజీ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయాణించాలని ప్రభుత్వ విప్ వినయ్‌భాస్కర్ తెలిపారు. మహాత్మ చూపిన అహింస, సత్యాగ్రహం దీక్ష ప్రేరణతోనే ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆయన తెలిపారు.
ఇదీ చదవండిఃమహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్