తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు - Gandhi Jayanthi 2020

మహాత్మ గాంధీ జయంతి వేడుకలను వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మునికి నివాళులు అర్పించారు.

వరంగల్ జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు
వరంగల్ జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2020, 1:04 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాశీబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న మహాత్ముని విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి మహాత్ముడు చేసిన సేవలను కొనియాడారు. గాంధీజీ ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగించాలని సూచించారు.

అనంతరం నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. గాంధీ జయంతి వేడుకలకు సమరయోధులు పాశికంటి వీరస్వామి హాజరై గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఇదీ చూడండి: భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details