తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి: రోడ్డు గుత్తేదారు - నాసిరకం రోడ్లపై మడికొండ గ్రామస్థుల ఆందోళన

తమ గ్రామంలోని ప్రధాన రహదారి పనులు నాసిరకంగా జరుగుతున్నాయని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామస్థులు గుత్తేదారుని నిలదీశారు. అతను దురుసుగా ప్రవర్తించడం వల్ల ఆందోళనకు దిగారు.

madikonda villagers protest in warangal against contractor who is constructing qualityless roads
నాసిరకం రోడ్లపై మడికొండ గ్రామస్థుల ఆందోళన

By

Published : Dec 26, 2019, 7:44 PM IST

నాసిరకం రోడ్లపై మడికొండ గ్రామస్థుల ఆందోళన

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట మండలం మడికొండ నుంచి ధర్మసాగర్​ వైపునకు ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోలింగ్​ తర్వాత.. డాంబర్​ మందం రోడ్డుకు ఒక ఇంచుకు పైగా ఉండాలని, కానీ అరఇంచు మాత్రమే ఉండటం గమనించిన గ్రామస్థులు గుత్తేదారుని నిలదీశారు.

నిబంధనల ప్రకారం నాణ్యమైన రోడ్డు వేయకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగా.. గుత్తేదారు వారితో దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్థులు తెలిపారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడని వెల్లడించారు.

గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మడికొండ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని సంఘటనాస్థలికి చేరుకున్న ఆర్​అండ్​బీ జేఈ రోడ్డును పరిశీలించారు. తక్కువ మందం ఉన్న చోట మళ్లీ డాంబర్​ వేసేలా చర్యలు తీసుకున్నారు. నాణ్యతతో రహదారి నిర్మాణం జరగాలని గుత్తేదారుని ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details