తెలంగాణ

telangana

ETV Bharat / state

రోజూ చేసే పనే ప్రమాదంలో పడేసింది - geetha karmikudu

ఎప్పటిలాగే కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కాడు.. కానీ ప్రమాదవశాత్తు జారీ కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ పట్టణ జిల్లాలో జరిగింది.

madikonda lo tatichettu nunchi jaripadda labour
తన పనే ప్రమాదంలో పడేసింది

By

Published : Mar 13, 2020, 9:50 PM IST

తాటిచెట్టు నుంచి జారిపడి ఓ గీత కార్మికుడికి గాయాలైన ఘటన వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట మండలం మడికొండలో చోటుచేసుకుంది. గీతకార్మికుడు మాచర్ల రమేష్ ఈరోజు సాయంత్రం కల్లు తీయడానికి వెళ్లి చెట్టుపైకి ఎక్కాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు పట్టు తప్పి కిందపడ్డాడు.

ప్రమాదంలో రమేష్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి గీత కార్మికులు 108కు, కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. తర్వాత చికిత్స నిమిత్తం రమేష్​ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

తన పనే ప్రమాదంలో పడేసింది

ఇదీ చూడండి :254 ఎకరాల దేవుడి భూములు స్వాహా

ABOUT THE AUTHOR

...view details