చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, గుట్టల మధ్యలో వంపులు తిరిగిన అందమైన సరస్సు లక్నవరంలో నెలవైంది. అక్కడకు వెళ్తే ఓ పట్టాన వెనక్కి రాలేమంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో లక్నవరానికి జలకళ వచ్చింది. 35 అడుగులకు నీటిమట్టం చేరి మత్తడి పోస్తోంది. గతంలో ఏర్పాటు చేసిన వేలాడే వంతెనకు తోడు ఇటీవల ఏర్పాటు చేసిన రెండో వంతెన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
వారంతాల్లో వరుస సెలవులు రావటంతో ఈ ప్రాంతానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. హైదరాబాద్‌తోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు లక్నవరం బాటపడుతున్నారు. నిండుకుండలా కనిపిస్తున్న సరస్సును చూసి పర్యటకులు మైమరిచిపోతున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా బోటింగ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు.
పర్యటకులను రారమ్మంటున్న లక్నవరం సరస్సు - lucknow-lake-is-a-popular-tourist-attraction
వరుస సెలవులతో లక్నవరం సరస్సుకు సందర్శకులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా వచ్చి లక్నవరం అందాలను తనివితీరా వీక్షిస్తున్నారు. సరస్సులో బోటింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు.
![పర్యటకులను రారమ్మంటున్న లక్నవరం సరస్సు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4102688-721-4102688-1565483699997.jpg)
పర్యాటకులను రారమ్మంటున్న లక్నవరం సరస్సు
పర్యాటకులను రారమ్మంటున్న లక్నవరం సరస్సు
ఇవీ చూడండి: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ
Last Updated : Aug 11, 2019, 8:08 AM IST