Heavy Fog in Warangal: ఓరుగల్లు నగరాన్ని మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 9 దాటినా... పొగ మంచు వీడట్లేదు. మంచు దట్టంగా కమ్మడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లుతున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద పొగ మంచుతో వరంగల్ తోరణం కనువిందు చేసింది.
Warangal Weather: పొగమంచుతో కనువిందు చేస్తున్న ఓరుగల్లు నగరం - పొగమంచు
Heavy Fog in Warangal: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. ఉదయం బయటకు రావడానికి జంకుతున్నారు. పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
![Warangal Weather: పొగమంచుతో కనువిందు చేస్తున్న ఓరుగల్లు నగరం Heavy Fog in Warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14028192-thumbnail-3x2-fog.jpg)
వరంగల్లో పొగమంచు
వరంగల్లో పొగమంచు
తెల్లవారు జామునుంచే మంచు కురుస్తోంది. ఉదయం నడకకు వచ్చిన వారు పొగ మంచులో ఫోటోలు తీసుకుంటున్నారు. మంచులో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చేంత వరకు కనిపించటం లేదని వాపోతున్నారు.
ఇదీ చూడండి:Low Temperatures in Telangana: పెరుగుతున్న చలి తీవ్రత.. బయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు