వరంగల్ అర్బన్ జిల్లా శివానగర్కు చెందిన వీరన్న... సిద్దిపేటకు చెందిన చెందిన దీప... నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. దీప హన్మకొండలోని హాస్టల్ ఉండి చదువుకుంటున్నప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా... ప్రేమకు దారి తీసింది.
నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రియుడు... మూడు రోజుల క్రితం వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు శివానగర్ చేరుకుని... ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
''నాలుగేళ్లుగా నేను వీరన్నతో ప్రేమలో ఉన్నాను. చాలా సార్లు ఈ ఇంటికి వచ్చాను. ఈ వీధిలో కూడా చాలా మందికి నేను తెలుసు. అతని కుటుంబసభ్యులకు కూడా మా విషయం తెలుసు. కానీ ఇప్పుడు నేను ఎవరో తెలియదు అన్నట్లు మాట్లాడుతున్నారు. మొన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడనే విషయం తెలిసి అడగడానికి వస్తే... ఇంట్లోనుంచి వాళ్లు బయటకు రావడం లేదు.''