తెలంగాణ

telangana

ETV Bharat / state

బైబై గణేశా... గంగమ్మ చెంతకు గణనాథులు - గణపతి‌ నిమజ్జనం

గణపతి బప్పా మోరియా అంటూ.... వరంగల్‌ నగరంలోని చెరువుల పరిసరా ప్రాంతాలు మారుమోగుతున్నాయి. అందంగా అలంకరించిన వాహనాలలో శోభియమానంగా వడ్డేపల్లి చెరువు, కరీమాబాద్ రంగసముద్రంలో నిమజ్జనం చేశారు.

lord-ganesha-immersion-started-in-warangal-city
గంగమ్మ చెంతకు చేరుతున్న గణనాథులు

By

Published : Aug 31, 2020, 4:41 PM IST

వరంగల్ నగరంలో గణేశ్‌ నిమజ్జనం నిరాడంబరంగా జరుగుతోంది. తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువు, కరీమాబాద్ రంగసముద్రం వద్ద భక్తులు కొవిడ్​ నిబంధలు పాటిస్తూ.. గణపతిని నిమజ్జనం చేస్తున్నారు.

గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు చేసిన నినాదాలతో చెరువుల పరిసరప్రాంతాలు మారుమోగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:ఆంజనేయ స్వామి గుడిలోనే గణనాథుని నిమజ్జనం

ABOUT THE AUTHOR

...view details