పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తిరుమలదేవి ప్రారంభించారు. క్రిమినల్, సివిల్, భూమి, ఆస్తి తగాదాలాంటి కేసులను పరిష్కరిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ కోసం వచ్చిన వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కారిస్తామని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు కక్షిదారులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
కక్షిదారులతో కిక్కిరిసిన కోర్టు పరిసరాలు - కక్షిదారులతో కిక్కిరిసిన వరంగల్ అర్బన్ కోర్టు పరిసరాలు
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కక్షిదారులు రాజీ కోసం ఎక్కువగా రావడం వల్ల కోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
కక్షిదారులతో కిక్కిరిసిన కోర్టు పరిసరాలు