వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. సరిగ్గా ఒంటి గంట నుంచే అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను మూసివేయడం మొదలుపెట్టారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ తెరిచిన దుకాణదారులు... ఆ తరువాత మూసివేశారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి జిల్లాలో లాక్డౌన్ ప్రారంభమైంది. ఆ తరువాత కొద్దిసేపటికే నగరంలోని ప్రధాన రహదార్లు జనసంచారం లేక... నిర్మానుష్యంగా మారాయి.
Lockdown effect: వరంగల్‌లో పటిష్టంగా అమలవుతున్న లాక్డౌన్
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
వరంగల్‌లో పటిష్టంగా అమలవుతున్న లాక్డౌన్
లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసే పనిలో భాగంగా పోలీసులు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 15 కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. అయితే సడలింపు సమయం దాటిన తరువాత కూడా వెళ్లే వాహనదారుల సంఖ్య నిన్నటితో పోలిస్తే... ఇవాళ తగ్గుముఖం పట్టింది.
ఇదీ చదవండి :ఆనందయ్య మందు.. కోటయ్య మృతి
TAGGED:
lockdown effect in warangal