వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్లోని ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఆరో రోజు లాక్డౌన్ నిబంధనలు పకడ్బందీగా అమలవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి దుకాణ సముదాయాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేయడంతో ప్రధాన ప్రాంతాలు బోసిపోయి కనిపిస్తున్నాయి.
ఓరుగల్లులో పకడ్బందీగా లాక్డౌన్ అమలు
కరోనా కట్టడికి ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ విధించి నేటికి 6 రోజులు కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఓరుగల్లు జిల్లాలో లాక్డౌన్ అమలవుతోంది. పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.
lockdown implementation in Warangal
ప్రధాన కూడళ్లలో పోలీసులు చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి అటుగా వచ్చే వాహనాల పర్మిషన్ పత్రాలను, వాహనదారుల ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన వాహనాల వివరాలు కనుక్కొని వదిలివేస్తుండగా... అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.