వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండో రోజు లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో.. దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. కొనుగోలుదారులతో కూరగాయల మార్కెట్లు కిటకిటలాడాయి. పది గంటల నుంచి లాక్‌డౌన్ మొదలు కావడంతో రహదారులపైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుర్తింపు కార్డులు ఉన్నవారు, వ్యాక్సిన్ వేసుకున్న వారిని అనుమతించారు. పలుచోట్ల నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండో రోజు ప్రశాంతంగా లాక్‌డౌన్ - lockdown goes on peacefully in warangal district
వరంగల్ ఉమ్మడి జిల్లాలో పోలీసులు లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్ సడలించిన సమయాల్లో ప్రజలు బయటకు వచ్చి తమ పనులు ముగించుకుంటున్నారు.
వరంగల్లో పటిష్ఠంగా లాక్‌డౌన్
హన్మకొండ, కాజీపేట, వరంగల్ ప్రధాన రహదారులు.. జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. బస్సులు 10 తర్వాత డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లా, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోను లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలుచేసేందుకు.. పోలీసులు చర్యలు చేపట్టారు. అనవసరంగా తిరిగే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.
ఇదీ చదవండి:టీకా పంపిణీపై లాక్‌డౌన్ ప్రభావం...కేంద్రాలకు తగ్గిన జనం