రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ను వరంగల్ అర్బన్ జిల్లా పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ నగరంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారిన వరంగల్ - corona updates in warangal
కరోనా వైరస్ వ్యాపి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ను వరంగల్ అర్బన్ జిల్లా పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని ఎక్కడివారిని అక్కడే నిలువరిస్తున్నారు.
నిర్మానుష్యంగా వరంగల్ రహదారులునిర్మానుష్యంగా వరంగల్ రహదారులు
ఉదయం పూట నిత్యావసరాల వస్తువుల కోసం బయటకు ప్రజలు వస్తున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వడం వల్ల హన్మకొండలోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.