లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని... ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు, పోలీసులు రోడ్లపై పహారా కాస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో కట్టుదిట్టంగా లాక్డౌన్ - corona latest updates
వరంగల్ ఉమ్మడి జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఉదయం నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేయడానికి ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల రద్దీ ఏర్పడింది. పోలీసులు ఎక్కడికక్కడే గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి....అనవసరంగా రహదారులపైకి వచ్చేవారిని అడ్డుకుంటున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో కట్టుదిట్టంగా లాక్డౌన్
నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొని దిల్లీ నుంచి వచ్చిన జిల్లాకు చెందిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అర్బన్ జిల్లా నుంచి 32 మంది ప్రార్థనలకు వెళ్లగా ఇప్పటివరకూ 19 మందిని గుర్తించి ఐసోలేషన్‌కు తరలించారు. వారికి కరోనా సోకలేదని నిర్ధరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 615 మందిని క్వారెంటైన్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ మంత్రుల సమీక్షలో వెల్లడించారు.
ఇవీ చూడండి:కలిసి కట్టుగా ఒకే జట్టుగా కరోనాపై జీ-20 పోరు