కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వ సూచనలపై రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలువుతోంది. వరంగల్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా హన్మకొండలోని సుబేదారి, బొక్కలగడ్డ, కుమార్‌పల్లి మార్కెట్, ఏనుగుల గడ్డ ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చేశారు.
కట్టుదిట్టంగా కరోనా కట్టడి చర్యలు - వరంగల్ అర్బన్‌లో కరోనా తాజా వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ, వరంగల్ నగరంలో 21 మందికి పాజిటివ్ కేసులు నమోదవడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా అవగాహన కల్పిస్తూ... వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు.
కట్టుదిట్టంగా కరోనా కట్టడి చర్యలు
ప్రజలను అనవసరంగా రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. ప్రధాన రోడ్ల వెంబడి పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు