వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ సమీపంలోని డంపింగ్ యార్డు.. చుట్టుపక్కల గ్రామాల పాలిట శాపంగా మారింది. సాయంత్రం 7 దాటిందంటే యార్డు నుంచి వచ్చే పొగ, దుర్వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో చెత్తకు నిప్పు అంటిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.
డంపింగ్ యార్డ్‌పై గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో.. స్థానిక కార్పొరేటర్ జోరిక రమేష్ మూడు రోజుల క్రితం ఫైరింజన్‌తో యార్డ్‌లో మంటలను ఆర్పించారు. కానీ పరిస్థితి పునరావృతం కావడంతో స్థానికులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో ఒక్క రాత్రి నిద్రిస్తే.. తమ బాధలు తెలుస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.