తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజీ మార్గమే.... రాజ మార్గం'

తగాదాలు ఏర్పడినప్పుడు ఇరుపక్షాలు పరస్పరం రాజీ మార్గంలో వెళ్లడమే ఉత్తమమని వరంగల్‌ జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌ స్పష్టం చేశారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించేందుకే లోక్‌అదాలత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

'రాజీ మార్గమే.... రాజ మార్గం'

By

Published : Aug 23, 2019, 1:26 PM IST

రాజీ మార్గమే.. రాజ మార్గమని వరంగల్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్ స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోందని త్వరితగతిన పరిష్కారం చేసేందుకు లోక్అదాలత్‌ను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా న్యాయస్థానాల్లో భార్యాభర్తల తగాదాలు, భూతగాదాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గతంలోనే సీనియర్ సిటిజన్స్ స్కీం ఉందని... ప్రతి జిల్లాలో ఓ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నట్లు ఆయన తెలిపారు.

'రాజీ మార్గమే.... రాజ మార్గం'

ABOUT THE AUTHOR

...view details