వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్న ఆమె విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్, వరంగల్ మేయర్ ప్రకాష్ రావులు పూల వేసి నివాళులర్పించారు.
'సావిత్రిబాయి పూలే నేటి తరానికి స్ఫూర్తి దాయకం' - తెలంగాణ తాజా వార్తలు
దేశంలో మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 190వ జయంతి సందర్భంగా హన్మకొండలోని కేయూలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్, వరంగల్ మేయర్ ప్రకాష్ రావులు ఆమె విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు.
!['సావిత్రిబాయి పూలే నేటి తరానికి స్ఫూర్తి దాయకం' Leaders paying tribute to Savitribai phule at hanamkonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10104787-325-10104787-1609674396308.jpg)
సావిత్రీ బాయికి నివాళులు అర్పించిన నేతలు
సమాజంలో విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలోనే మహిళలు పురుషులతో సమానంగా ఉండాలని సావిత్రిబాయి పోరాడినట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితమంతా పనిచేసిన జ్యోతీరావ్ పూలే తరహాలోనే.. సావిత్రీబాయి సైతం మహిళల కోసం పని చేశారని కొనియాడారు.
ఇదీ చూడండి :గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలి: ఆర్. కృష్ణయ్య