తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికులతో కిక్కిరిసిన లక్ష్మీపురం బస్టాండ్​ - latest news on Laxmipuram bus stand rush with passengers

సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం వరంగల్​ అర్బన్​ జిల్లా లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన బస్సు ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Laxmipuram bus stand rush with passengers
ప్రయాణికులతో కిక్కిరిసిన లక్ష్మీపురం బస్టాండ్​

By

Published : Feb 6, 2020, 3:12 PM IST

మేడారం జాతరకు వెళ్లే భక్తులతో వరంగల్ నగరంలోని లక్ష్మీపురం పండ్ల మార్కెట్​లో ఏర్పాటు చేసిన బస్సు ప్రాంగణం కిటకిటలాడుతోంది. వరంగల్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని గుర్తించిన పోలీసులు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రయాణికులను త్వరితగతిన గమ్య స్థానాలకు చేర్చే విధంగా ఆర్టీసీ అధికారులు సర్వీసులను నడిపిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్ ఆవరణలో చలువ పందిళ్లు, సాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

ప్రయాణికులతో కిక్కిరిసిన లక్ష్మీపురం బస్టాండ్​

ఇదీ చూడండి :గద్దెలపై కంకవనం..సాయంత్రం సమ్మక్క దర్శనం..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details