వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అతిపెద్ద పట్నం వేశారు. ఆలయ నిర్వాహకులు, 60 మంది ఒగ్గు పూజారులతో రాష్ట్రంలోనే తొలిసారిగా 36 ఫీట్ల పట్నాన్ని రంగవల్లులతో రూపొందించారు. అనంతరం గొల్ల కేతమ్మ, మేడలమ్మ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం నిర్వహించారు.
ఐనవోలులో అతి పెద్ద మల్లన్న పట్నం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో తొలిసారిగా.. అతిపెద్ద పట్నం వేశారు. 60 మంది ఒగ్గుపూజారులు కలిసి 36 ఫీట్ల పట్నం వేశారు. పట్నాన్ని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఐనవోలులో అతి పెద్ద మల్లన్న పట్నం
పట్నం మధ్యగల స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. పెద్దపట్నం డ్రోన్ చిత్రాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి:శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీరమణ