వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్) ఆధ్వర్యంలో 100 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశారు. అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిట్ సంచాలకుడు ఎన్వీ రమణారావు తెలిపారు.
నిట్లో పేద విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ
ప్రస్తుతం ఆన్లైన్ ద్వారానే తరగతులు నిర్వహిస్తున్నందు వల్ల పేద విద్యార్థులు వాటికి దూరమవుతున్నారు. వరంగల్ నిట్లో చదువుతున్న వారికి అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు తెరవకపోవడంతో 100 మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశారు.
నిట్లో పేద విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ
కరోనా కారణంగా విద్యాలయాలు తెరుచుకోకపోవడం వల్ల ఆన్లైన్ ద్వారానే విద్యాబోధన జరుగుతోందని అన్నారు. కొంతమంది పేద, మధ్య తరగతి విద్యార్థులు తరగతులకు దూరం కావద్దనే ఉద్దేశంతో ల్యాప్టాప్లను అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అధ్యాపకులు, పూర్వ విద్యార్థులను డైరెక్టర్ అభినందించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవాలని ఆయన సూచించారు.