వరంగల్లో సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో మంగళవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని లక్ష దీపాలను వెలిగించారు. నిండు పౌర్ణమి వేళ వేయి స్తంభాల గుడి మహిళలతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణాన్ని లక్ష దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి రుద్రేశ్వరుని దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
లక్ష దీపాల వెలుగుల్లో వేయిస్తంభాల గుడి - laksha deepotsavam at 1000 pillar temple
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఓరుగల్లులోని సుప్రసిద్ధ వేయిస్తంభాల ఆలయం లక్ష దీపాలతో శోభయామానంగా వెలిగిపోయింది.
లక్ష దీపాల వెలుగుల్లో వేయిస్తంభాల గుడి