రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి వరంగల్‌లోని చెరువులు, కుంటలు నిండు కుండను తలపిస్తున్నాయి. దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువుతోపాటు ఉర్సు కరీమాబాద్‌లోని రంగసముద్రం చెరువులు అలుగు పారుతున్నాయి.
ఓరుగల్లులో జోరు వానలు.. అలుగు పారుతున్న చెరువులు - వర్షాలు
వరంగల్ నగరంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రెండు రోజులుగా భారీగా కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి.
నిండుకుండను తలపిస్తున్న చెరువులు
చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోవడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజులుగా నీరులేక బోసిపోయిన చెరువులు భారీ వర్షాల కారణంగా జలకళను సంతరించుకున్నాయి.
ఇవీ చూడండి: రాష్ట్ర నూతన సచివాలయం నమూనా విడుదల చేసిన సర్కారు