Unikacherla lake kabza : బతుకుదెరువుపై.. బడా రియల్టర్ల కన్ను Lake occupancy in hanumakonda : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో మూడొందల కుటుంబాలు మత్స్యకారులవే. సమీపంలోని నాలుగు నీటి కుంటల్లో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల పేరంగుంట చెరువుపై అక్రమార్కుల కన్నుపడింది.తటాకం చుట్టూ భూములకు విలువ పెరగడంతో దాన్ని పూడ్చేందుకు ఆక్రమణదారులు పావులు కదుపుతున్నారు.రాత్రికి రాత్రి వెంచర్లు చేసుకుని చెరువును దురాక్రమణచేస్తున్నారు.
చెరువు పక్కనే ఉన్న కొండను తవ్వి..ఆ మట్టితో చెరువును క్రమంగా పూడ్చేస్తున్నారు. ఇదేమని అడిగితే...మేం కొనుక్కున్నాం కనుక మాకే హక్కులున్నాయంటూ బెదిరిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో బతుకునిచ్చే నీటివనరును కాపాడాలంటూ హనుమకొండకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ముదిరాజ్ సంఘం సభ్యులంతా మూకుమ్మడిగా ఆందోళన చేపట్టి కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాతల కాలం నుంచి తమకు చెరువే ఆధారమని....చేపలు పట్టడం తప్ప వేరే పని చేయలేని తాము ఎట్టా బతుకాలనిమత్స్యకారులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.కన్నతల్లి లాంటి చెరువు కనుమరుగైతే...తాము ఉపాధి లేక రోడ్డున పడతామని ఆవేదన చెందుతున్నారు.మూడున్నర ఎకరాల చెరువు క్రమంగా కుచించుకుపోతోందని.. అధికారులే రక్షించాలంటూ వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమచెరువును కబ్జాకోరుల నుంచి కాపాడాలనికలెక్టర్‌ను కోరుతున్నారు.
Gudigunta pond land kabja in mulugu : ఆ చెరువు... 450 ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. పాతికేళ్ల క్రితం నీటిపారుదలశాఖ నిర్మించింది. ఆయకట్టుదారులు ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. ఇటీవల ఈ జల భాండాగారంపై అక్రమార్కుల కన్ను పడింది. రికార్డులను తారుమారు చేసి.. అధికారుల అండతో చెరువు శిఖం భూమిలో దర్జాగా మట్టి నింపేస్తున్నారు. జాతీయరహదారి పక్కనే ఉండటం వల్ల...విలువైన భూమిని పరిరక్షించాలని రైతులు వేడుకుంటున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్‌లో గుడికుంట శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. హైదరాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి... కోట్ల విలువైన స్థలాన్ని చెరపట్టేందుకు రంగంలోకి దిగాడు. తన అనుచరుల పేరిట తప్పుడు రికార్డులు సృష్టించి... శిఖం భూమిలో మట్టిని నింపేస్తున్నారు. ఇదేంటని అడిగితే బెదిరించడమే కాకుండా... అధికారుల అండతో బోర్లు సైతం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు అడ్డుకున్నారు. దాదాపు 450 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువును కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు.
"చేపలు పట్టడం తప్ప వేరే పని చేయలేము.కన్నతల్లి లాంటి చెరువు కనుమరుగైతే.. ఉపాధి లేక రోడ్డున పడతాము. తాతల కాలం నుంచి మాకు చెరువే ఆధారము. మూడున్నర ఎకరాల చెరువు క్రమంగా కుచించుకుపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. చెరువును కబ్జాకోరుల నుంచి కాపాడాలి". - ఉనికిచెర్ల గ్రామస్థులు
ఇవీ చదవండి: