హెచ్ఎండీఏ తరహాలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా)ను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కార్యచరణ చేపట్టాలని కుడా బోర్డ్ కమిటీ నిర్ణయించింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుడా కార్యాలయంలో ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన తొలి పాలకమండలి సమావేశమైంది. జూన్ 17న వరంగల్లో కేటీఆర్ పర్యటనతో పాటు పట్టణాభివృద్ధి సంస్థ కార్యకలాపాలు, ఆదాయవ్యయాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు తదితర అంశాలను సమావేశంలో చర్చించారు.
హుడా తరహాలో కుడాను మార్చేందుకు సన్నాహాలు - kuda board members meeting to impreove like huda
హుడా తరహాలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థను బలోపేతం చేసే దిశగా నిధులు సమకూర్చేలా పని చేయాలని కుడా బోర్డ్ కమిటీ.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన తొలి పాలకమండలి సమావేశంలో నిర్ణయించింది. అనధికారిక లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు.
హుడా తరహాలో కుడాను మార్చేందుకు సన్నాహాలు
కుడా లేఅవుట్ వివరాలు, నియోజకవర్గాల్లో కుడా నిధులతో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టే పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని.. అనధికారిక లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హుడా తరహాలో కుడాను అభివృద్ధి చేసేందుకు రూ. వేయి కోట్ల నిధులను సమకూర్చడమే లక్ష్యంగా పని చేయాలని తీర్మానించారు.
ఇదీ చూడండి:దేశంలో 90 శాతం ఉద్యోగులకు ఆదాయ గండం!