KTR Interesting Comments in Warangal :ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి జయభేరి మోగిస్తారని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ డిసెంబర్‌లో రాష్ట్రంలో ఎన్నికలొస్తాయన్న మంత్రి బీఆర్ఎస్ విజయం ఖాయమైందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పేదలకు అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పారు. నాణ్యమైన వస్త్రాల ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ భవిష్యత్తులో మేడిన్ తెలంగాణగా మారుతుందని కేటీఆర్ వివరించారు.
వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల్లో టెక్స్‌టైల్ పార్క్‌లో రూ.900 కోట్లతో నెలకొల్పనున్న కొరియా పరిశ్రమ యంగ్ వన్‌కుకేటీఆర్ భూమిపూజ చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతోపాటు యంగ్ వన్ పరిశ్రమ తరపున ప్రత్యేక అతిధిగా.. కొరియా రాయబారి చంగ్ జే బక్ భూమిపూజలో పాల్గొన్నారు. ఇక్కడ తయారైన దుస్తులు.. ప్రపంచ విపణికలోకి వెలుతాయని కేటీఆర్ తెలిపారు. టెక్స్‌టైల్ రంగంలోనూ, వ్యవసాయంలోనూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలుంటాయని ఆయన చెప్పారు.
KTR Speech at Warangal :మూడు వస్త్ర పరిశ్రమల్లో 99 శాతం స్ధానికులకే ఉద్యోగాలు దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితమే జౌళి పార్క్ నెలకొల్పినా.. కేంద్రం ఆలస్యంగా మేలుకొందని విమర్శించారు. ఈ క్రమంలోనే టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి భూములిచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా భూములు కోల్పొయిన వారికి.. ఆగస్టు 15 కల్లా వందగజాల స్ధలాలతో పట్టాలివ్వాలని స్ధానిక శాసనసభ్యుడు, అధికారులను కేటీఆర్ ఆదేశించారు.