ఓరుగల్లులో ఐటీ దిశగా అడుగులు పడ్డాయి. మడికొండ ప్రత్యేక ఆర్ధిక మండలిలో సైయెంట్ , టెక్ మహీంద్ర సంస్ధలు నిర్మించిన నూతన ప్రాంగణాలను... ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ద్వితీయ శ్రేణి నగరంగా పేరొందిన వరంగల్... పూర్తిస్థాయిలో ఐటీ హబ్‌గా ఖ్యాతి గడించనుందని తెలిపారు.
టెక్ కేంద్రంగా ఓరుగల్లు: మంత్రి కేటీఆర్ - వరంగల్‌లో ఐటీ కంపెనీలను ప్రారంభిచిన కేటీఆర్
చారిత్రక నగరం ఓరుగల్లు ఐటీ ప్రయాణంలో కీలక అడుగు పడింది. మడికొండ ప్రత్యేక ఆర్ధిక మండలిలో సైయెంట్, టెక్ మహీంద్ర సంస్థల నూతన ప్రాంగణాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వరంగల్, కరీంనగరే కాదు రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తామని వెల్లడించారు.
టెక్ కేంద్రంగా వరంగల్!...
జిల్లాల్లో ఐటీ విస్తరణ ఇది ఆరంభం మాత్రమేనని రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తామని హామీ కేటీఆర్ ఇచ్చారు. అత్యాధునిక హంగులతో 5 ఎకరాల్లో సైయెంట్ నూతన భవనం నిర్మాణం పూర్తిచేసుకున్నట్లు తెలిపారు.
Last Updated : Jan 7, 2020, 3:17 PM IST