వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామి జాతర ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తకొండ దేవస్థానం ప్రసిద్ధి గాంచింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే కోర మీసాల స్వామిగా వీరభద్రుడు ఇక్కడ కొలువుదీరాడు. ఈ దేవస్థానానికి రెండు వందల ఏళ్ల పురాతన చరిత్ర ఉందని స్థానికుల అభిప్రాయం.
'జాతరకు ముస్తాబవుతున్న కొత్తకొండ వీరభద్రడు' - ముస్తాబవుతున్న కొత్తకొండ వీరభద్ర ఆలయం@ జాతర
వరంగల్ అర్బన్ జిల్లాలోని కొత్తకొండలో కొలువుదీరిన వీరభద్రుడి జాతర మరో నాలుగు రోజుల్లో మెుదలుకానుంది. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.
ఈ నెల 10 నుంచే కొత్తకొండ వీరభద్ర స్వాఈ నెల 10 నుంచే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరమి జాతర
ఈ నెల 10 నుంచి జాతరలో భాగంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 18న అగ్నిగుండాలతో ఈ ఘట్టం ముగియనుంది. స్వామి వారికి గుమ్మడికాయలు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. రంగుల రాట్నం, కుమ్మరుల ఎడ్ల బండ్లు, మేకల బండ్లు భక్తులను అలరించనున్నాయి. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఈ వేడుకలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో తరలివస్తారు.
ఇవీ చూడండి : 'వైభవంగా శ్రీవారి వైకుంఠ ద్వార వేడుకలు'