ఎర్ర జొన్న, పసుపు రైతుల ఆందోళనతో తెలంగాణ రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిశాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ జాతీయ మహాసభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్షకులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు ప్రభుత్వ సహకారం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు పంట రుణాలతో పాటు రుణ మాఫీ చేయాలని కోరారు. రైతుల సమస్యలు తీరే వరకు నిర్విరామంగా పోరాడుతామని కోదండరాం తేల్చి చెప్పారు.
'రైతుల సమస్యలు తీరే వరకు పోరాడుతూనే ఉంటా'
మద్దతు ధర కోసం ఎర్ర జొన్న, పసుపు రైతులు చేసిన పోరాటం వల్లే తెలంగాణ రైతుల కష్టాలు ప్రపంచానికి తెలిశాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.
'రైతుల సమస్యలు తీరే వరకు పోరాడుతూనే ఉంటా'