తెలంగాణ

telangana

ETV Bharat / state

28న పారామెడికల్‌ పీజీ కోర్సుల్లో ధ్రువపత్రాల పరిశీలన - warangal urban latest news

ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 28 న హైదరాబాద్‌లోని ప్రోఫెసర్‌ జి. రాంరెడ్డి దూర విద్యాకేంద్రంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.

knruhs Notification for verification of Original Certificates Admission into MSc Nursing, MPT courses
పారామెడికల్‌ పీజీ కోర్సుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు ఆహ్వానం

By

Published : Jan 26, 2021, 8:25 PM IST

ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రెండు కోర్సులకు జనవరి 27 సాయంత్రం 5గంటలతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తరువాత దరఖాస్తు చేసిన అభ్యర్ధుల జాబితాను యూనివర్సిటీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.

అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 28న హైదరాబాద్‌ ఓయూలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి దూర విద్యాకేంద్రంలో... ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని వర్శిటీ అధికారులు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తారు.

ఇదీ చదవండి: రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కండి: బండి

ABOUT THE AUTHOR

...view details