తెలంగాణ

telangana

ETV Bharat / state

మా పొట్ట కొట్టొద్దు: మిల్లు కార్మికులు - వరంగల్ అర్బన్​ జిల్లా తాజా వార్తలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా పంథినిలోని ఓ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు దిగారు. విధుల్లో నుంచి తీసేసి తమ పొట్ట కొట్టొద్దని మొర పెట్టుకున్నారు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించి బిహార్‌ వారిని పెట్టుకోవడం అన్యాయమన్నారు.

మా పొట్ట కొట్టొద్దు: మిల్లు కార్మికులు
మా పొట్ట కొట్టొద్దు: మిల్లు కార్మికులు

By

Published : Aug 29, 2020, 8:46 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథినిలోని కేఎం బాయిల్‌ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు దిగారు. అకారణంగా తమని తొలగించి బిహార్‌కు చెందిన వారిని విధుల్లోకి తీసుకువడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు.

గత 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్న 30 మంది కార్మికులను తొలగించి బిహార్ వారిని పెట్టుకోవడం అన్యాయమన్నారు. మిల్‌ ముందు బైఠాయించారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

ABOUT THE AUTHOR

...view details