వరంగల్ అర్బన్ నగరాన్ని మంచుదుప్పటి కప్పేసింది. పొగమంచుతో ఖిలా వరంగల్ కోట అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మంచు అందాల మధ్య వరంగల్ నగరాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవంటున్నారు నగరవాసులు.
పొగమంచు చాటున ఖిలావరంగల్ అందాలు - ఖిలా వరంగల్ అందాలు
ప్రకృతి అందాలతో తెల్లని మంచు దుప్పటి పరిచినట్టుగా ఖిలా వరంగల్ నగరవాసుల మనస్సులను కట్టిపడేస్తుంది.
పొగమంచు చాటున ఖిలావరంగల్ అందాలు
ఉదయం పది కావస్తున్నా భానుడు మబ్బుల చాటున దోబూచులాడుతూ చూపరుల మనస్సులను కట్టిపడేశాడు. మంచు అందాలను నడుమ నగరాన్ని చూసేందుకు పట్టణవాసులు పెద్ద సంఖ్యలో ఖిలా వరంగల్ వద్దకు చేరుకుని ఆనందంలో మునిగిపోయారు.
ఇదీ చూడండి: అకాల వర్షం... అన్నదాతల దైన్యం