వరంగల్ పట్టణ జిల్లా ఆత్మకూరు మండలం కామారంలో రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి హాజరయ్యారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది రైతుల వేలిముద్రలు రావడంలేదని, కోర్టుకేసుల్లో కొన్ని భూములు ఉన్నట్లు తనదృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. అన్నదాతను అన్ని విధాలుగా ఆదుకుంటున్న కేసీఆర్.. రైతు బాంధవుడని కొనియాడారు.
కేసీఆర్ రైతు బాంధవుడు: ధర్మారెడ్డి - mla
కేసీఆర్ రైతు బాంధవుడని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ పట్టణ జిల్లా కామారంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన భూ సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ