కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్ ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వం తరఫున అన్ని విధాల కృషి చేస్తామని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో రైల్వే డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ సన్నాహాక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కాజీపేట డివిజన్ కోసం కేంద్రానికి నివేదిస్తాం : వినయ్ భాస్కర్ - కాజీపేట రైల్వే డివిజన్ సాధన సమితి సమావేశం
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం కేంద్రానికి నివేదిక పంపుతామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి, ఎంపీలతో చర్చిస్తానని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![కాజీపేట డివిజన్ కోసం కేంద్రానికి నివేదిస్తాం : వినయ్ భాస్కర్ kazipet-railway-division-sadhana-samithi-meeting-today in kazipet in warangal urban district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10718511-279-10718511-1613908054975.jpg)
రైల్వే డివిజన్ సాధన సమితి సమావేశంలో మాట్లాడుతున్న దాస్యం వినయ్ భాస్కర్
డివిజన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి, ఎంపీలతో చర్చిస్తానని అన్నారు. కాజీపేట జంక్షన్ డివిజన్‌గా మార్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని సాధన సమితి సభ్యులు వివరించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఫిట్‌లైన్ పనుల వేగవంతం, వ్యాగన్ వర్క్ షాప్ పనులు ప్రారంభించాలనే డిమాండ్లపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో సాధన సమితి వ్యవస్థాపకులు గాదె ఇన్నారెడ్డి, కర్ర యాదవరెడ్డి పాల్గొన్నారు.