అమ్మాయిలు ఆపదలో ఉన్నామని భావిస్తే... వెంటనే 100కి డయల్ చేయాలని కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో విద్యార్థులకు అత్యవసర సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపద సమయంలో డయల్ 100, షీటీమ్ ఆవశ్యకతలను వివరించారు. ఒక విద్యార్థిని చేత ప్రత్యక్షంగా 100కి ఫోన్ చేయించి.... తాను ప్రమాదంలో ఉన్నానని చెప్పించగా.. కేవలం ఐదు నిమిషాలలో అక్కడికి వచ్చిన బ్లూకోట్ సిబ్బందిని చూసి విద్యార్థినిలు ఆశ్చర్యపోయారు.
'అమ్మాయిలు ఆపదలో ఉంటే కాల్ 100'
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో విద్యార్థులకు అత్యవసర సేవలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆపదలో ఉంటే కాల్ 100
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిని అమ్మాయిలు ఏ విధంగా గుర్తించాలని ఏసీపీ వివరించారు. పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు పట్ల విద్యార్థినిలు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలికి నిప్పు అంటించిన రాక్షసులు