వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయనికి భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా తెల్లవారు జామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు.
వేయి స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు
కార్తిక సోమవారం పురస్కరించుకుని వేయి స్తంభాల ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
వేయి స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనంతరం రుద్రేశ్వరుణ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది.
ఇదీ చదవండి: కాశీలో అంగరంగ వైభవంగా 'అతిరుద్ర యాగం'